నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతిచెందారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.
మృతులంతా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ వాసులుగా గుర్తించారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగానూ నిర్ధారించారు.
బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి.. తిరుగు ప్రయాణంలో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు
