నిజామాబాద్: నగరంలోని ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు సందడిగా ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య సంఘానికి చెందిన మొత్తం 6 అనుబంధ సంఘాల్లో ఇప్పటికే రెండు సంఘాలకు అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన నాలుగు సంఘాలకు సంబంధించి పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు .
అన్ని సంఘాల్లో ను పోటీ హోరాహోరీగా సాగుతుంది. ఆయా కమిటీ ల్లో గెలవడానికి అభ్యర్థులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు
ఏకగ్రీవంగా ఎన్నికైన వారు:ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా మా శెట్టి లిఖిత్ కుమార్నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా చిన్ని వివేకానంద గుప్త ఎన్నికయ్యారు.
మిగిలిన నాలుగు సంఘాలకు మాత్రం పోలింగ్ జరగనున్నాయి. 10,017 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థులు:ఇందూర్ పట్టణం ఆర్యవైశ్య సంఘం::1) అర్వపల్లి పురుషోత్తం, 2)ధన్పాల్ శ్రీనివాస్,లున్నారు కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ కోసం :1) పాలి రవికుమార్, 2) బాశెట్టి విశ్వనాథ్,వైశ్య భవన్ కమిటీకి : 1) ఇల్లెందుల సుధాకర్ 2) విశ్వనాథ్ నారాయణ. నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్ – వైశ్య జూనియర్ కళాశాల కమిటీకి : 1) ఇంగు శివప్రసాద్, 2) గజవాడ హనుమంతురావుఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ను జూలై 6వ ఆదివారం నిర్వహిస్తామన్నారు. పోలింగ్ అనంతరం తదుపరి రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లందరినీ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సంఘ అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు తమ మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు.
