యోగా సాధన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగంగా కావాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ఆధ్వర్యంలో నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్లో సాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. శారీరిక మానసిక ఆధ్యాత్మిక సమతుల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు మన ప్రాచీన భారతీయ పురుషులు మహర్షులు అందించిన వరప్రదాయని యోగ, యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహర, ధరణ, ధ్యాన, సమాధి, యోగ యొక్క అష్టాంగములు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా విశిష్టతను వివరిస్తూ సంవత్సరంలో ఒక రోజును యోగా ప్రపంచ దినోత్సవం గా జరుపుకుందామని పిలుపునివ్వగా నూట తొంబై మూడు సభ్య దేశాలుగా గల యు ఎన్జీఏ లో 177 దేశాల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రతి సంవత్సరము 21 జూన్ 2017 సంవత్సరం నుండి ప్రపంచ యోగ దినోత్సవం గా జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ..యోగా అనేది శరీర దృఢత్వానికి మనసు ప్రశాంతతకు చాలా ఉపయోగకరమైన దాని సూచించారు. డ్రగ్స్ వాడకం తగ్గించాలని తెలియజేశారు. జూన్ 26వ తారీఖున యాంటిడ్రగ్స్ డే రావడం అదే నెలలో 21 వ తారీఖున యోగా రావడం మంచిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘాలు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, క్రీడాకారులు, యోగా గురువులు సంగీత డాక్టర్ తిరుపతిరావు, గంగాధర్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.
