Thursday, April 16, 2026
HomeDevotionalనిజామాబాద్‌లో జగన్నాథుని రథయాత్ర ప్రారంభంఐస్కాన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్షిక మహోత్సవాలు

నిజామాబాద్‌లో జగన్నాథుని రథయాత్ర ప్రారంభంఐస్కాన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్షిక మహోత్సవాలు

నిజామాబాద్: ఐస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్‌నెస్) నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిదవ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాత గంజ్ క్లాక్ టవర్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశవ వేణు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పురి జగన్నాథుని భక్తితో కొలుచుకొని, రథాన్ని అందంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

ఈ మహోత్సవాలు ఈరోజు నుండి వచ్చే శుక్రవారం వరకు కొనసాగనున్నాయని, ప్రతిరోజూ భజనలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. భక్తుల సందర్శనార్థం ఏర్పాట్లను ఇస్కాన్ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.

జగన్నాథుని దివ్య దర్శనం, రథయాత్రలో భాగస్వామ్యం కావాలని భక్తులకు నిర్వాహకులు ఆహ్వానం పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!