నిజామాబాద్: జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్, తో పాటు సంఘం ఎన్నికలు కాసేపట్లో జరగనున్నాయి. స్థానిక మున్నారుకాపు సంఘం కల్యాణ మండపం లో సాయంత్రం జరిగే పోలింగ్ పక్రియ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసారు.
అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు సైతం తరలి వస్తున్నారు. రెండు ఫ్యానల్ లు రంగంలోకి దిగాయి హోరాహోరిగా తలపడుతున్నాయి. 1966 లో ఏర్పాటైన అసోసియేషన్ లో . ప్రస్తుతం దాదాపు 1,300 మంది సభ్యులు ఉన్నారు.వైద్య విభాగంలో ఈ అసోసియేషన్ కు మంచి పలుకుబడి ఉంది.
నగరంలో పేరుమోసిన మెడికల్ ఏజెన్సీ లకు చెందిన యజమానులు ఇందులో సభ్యులుగా వుంటారు.ఈసారి ఎన్నికల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
అధ్యక్ష పదవికి నల్ల మధుసూదన్,సత్య ప్రసాద్ ,పోటీ పడగా, జనరల్ సెక్రటరీ స్థానానికి బీర్పూర్ సుధాకర్, సంతోష్, పోటీలో నిలిచారు. కోశాధికారిగా మోర సాయిలు మరియు కాపర్ రమేష్ అభ్యర్థులుగా తలపడుతున్నారు.
ఆయా పదవులకు పోటీ చేస్తున్న వారు గత వారం రోజులుగా ప్రచారం చేస్తుండగా ఆదివారం ఎన్నికలు జరిగే వేదిక వద్ద భారీగా ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు.
