ఎల్లారెడ్డి. వీధిలో నిర్లక్ష్యం వహించిన ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజ్ అధికారి ఓంకార్ నాయక్ ను ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ సస్పెండ్ చేసినట్లు సమాచారం. అటవీశాఖ అధికారులు ఈ మేరకు ఎఫ్ఆర్ఓ సస్పెన్షన్ సంబంధించిన వివరాలు ఆదివారం వెల్లడించారు.
ఎల్లారెడ్డి అటవీశాఖ ఎఫ్ఆర్ఓ గా విధులు చేపట్టిన కాలంలో అడవిలో చెట్లు, గ్రీనరీ తగ్గడం జరిగింది. ప్రతిస్మాత్మకంగా ప్రారంభించిన అర్బన్ పార్క్ నిర్మాణం లో నిర్లక్ష్యం వహించారని తెలుస్తుంది.
అలాగే అటవీశాఖ భూముల్లో చర్చి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు అటవీ శాఖ భూముల్లో నిర్మాణాలకు అవకాశం కల్పించాడని ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి.
అడవులను యదేచ్చగా నరుకుతున్న విధులు పట్ల ఎఫ్ఆర్ఓ ఓంకార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తుంది. అటవీ భూములను కబ్జా చేసి దున్నుకున్నా ఎఫ్ ఆర్ ఓ చూసి చూడనట్లు వివరించారని ఉన్నతాధికారులకు సమాచారం అందింది
. ఓంకార్ తన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విలువైన అడవులు అటు భూములు కబ్జా పాలయ్యాయని ఆగ్రహం చెందిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ మేరకు ఎఫ్ఆర్ఓ పై శాఖ పరమైన విచారణ త్వరలో జరగనున్నట్లు తెలుస్తుంది.
