నిజామాబాద్ నగరంలో పని చేస్తున్న జర్నలిస్టులందరికి నెలరోజుల్లోగా ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లు హామీ ఇచ్చారు.
ఇండ్ల స్థలాల సాధన కోసం నిజామాబాద్ నుండి వెళ్లిన జర్నలిస్టులు వారిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. నివాస యోగ్యం కాని గుండారం గుట్టలు కాకుండా నగరానికి సమీపంలో నివాస యోగ్యం కలిగిన స్థలాలను జర్నలిస్టులకు ఇవ్వాలని చేసిన డిమాండ్ పట్ల మహేష్,షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ గుండారం భూములు జర్నలిస్టుల నివాస స్థలాల కోసం ప్రతిపాదించరాదని వారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కి మహేష్ గౌడ్,షబ్బీర్ అలీ సూచించారు. గుండారం భూములకు ప్రత్యామ్నాయ భూములను వెంటనే గుర్తించాలని కలెక్టర్ను ఆదేశించారు.
జర్నలిస్టు లకు అవసరమైన ఇండ్ల స్థలాలను ఎంపిక చేయడానికి రేపటినుంచే క్షేత్ర స్థాయిలో పరిశీలన మొదలు పెట్టాలని ఆర్డీఓ ను ఆదేశించారు మహేష్ గౌడ్, షబ్బీర్ అలీ.ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్ల నిర్మాణం కోసం సహకరిస్తామని వారు మాట ఇచ్చారు.
ఈ సంధర్భంగా జర్నలిస్టులు షబ్బీర్ అలీ, మహేష్ గౌడ్ కు కృతజ్ఞతలు చెప్పారు.
