HomeTelanganaNizamabadరేపు అమిత్ షా రాక..భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు.బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా...

రేపు అమిత్ షా రాక..భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు.బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా బహిరంగసభకు సర్వం సిద్ధం అవుతోంది.

ఆదివారం జిల్లా కేంద్రంలోని కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

ఈ మేరకు కంటేశ్వర్ లోని పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద భారీ ఎత్తున్న కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సభకు భారీగా రైతులు జనసమీకరణతో పాటు పెద్దసంఖ్యలో పార్టీ కేడర్ పాల్గొనేలా చేయడం ద్వారా సభసక్సెస్ చేసి సత్తా చాటాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

ప్రధానంగా రైతులను అధిక సంఖ్యలో సభకు సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహిరంగ సభ విజయవంతం కోసం..సభను విజయవంతం చేయడం కోసం బీజేపీ జిల్లా నాయకత్వాలు సర్వశక్తులొడ్డాయి. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత జిల్లాకు వస్తుండడంతో నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో ఇందూరు కాషాయమయంగా కనిపిస్తోంది. సభా ప్రాంగణంలో అమిత్, ప్రధాని మోదీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇది వరకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేశారు.

భారీ బందోబస్తు..అమిత్ సభ కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభ ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య అధికారులతో సమీక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments