HomeCRIMEడీఎస్ విగ్రహావిష్కరణలో చెలరేగిన చైన్ స్నాచర్ లు ....హోం మంత్రి మీటింగ్ ల్లో ముగ్గురి గొలుసు...

డీఎస్ విగ్రహావిష్కరణలో చెలరేగిన చైన్ స్నాచర్ లు ….హోం మంత్రి మీటింగ్ ల్లో ముగ్గురి గొలుసు లు మాయం ……కేసు లు నమోదు చేసిన పోలీసులు

దేశ హోం మంత్రి పాల్గొన్న డీఎస్ విగ్రహావిష్కరణలో లో గొలుసు దొంగలు చెలరేగి పోయారు. ఏకంగా ముగ్గరి గొలుసులు మాయం చేసారు.

పోలీసులు కేసులు నమోదు చేసుకొని సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు రూరల్ ఎస్ఐ ఆరీఫ్ తెలిపిన వివరాలు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన కాసుల రఘు,బాశెట్టి గంగాధర్ లు విగ్రహావిష్కరణ చూసేందుకు కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతానికి వచ్చారు.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విగ్రహావిష్కరణ సమయంలో ఒక్కసారిగా ప్రజలు తరలిరావడంతో గుర్తు తెలియని దుండగులు కాసుల రఘు కు చెందిన 1.5 గ్రాముల బంగారం చైన్,అలాగే బాశెట్టి గంగాధర్ కు చెందిన 12 గ్రాముల బంగారం చైన్ ను మెడల్లో నుంచి అపహరించినట్లు తెలిపారు.

ఈ మేరకు బాధితులు స్థానిక రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అలాగే పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన కిషన్ సమేళన్ లో మరో వ్యక్తికి చెందిన 1.5 గ్రాముల బంగారం గొలుసు అపహరించినట్లు తెలిపారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments