డబ్బులు ఇస్తే చాలు ఏ పనైనా క్షణాల్లో చేసేస్తారు. ప్రభుత్వ నిబంధనలతో పట్టింపు లేదు. ఆర్మూర్ ఆర్టిఏ కార్యాలయంలో అవినీతి దందా జోరుగా కోనసాగుతుంది.
ప్రభుత్వం ద్వారా నియమించబడిన రవాణా శాఖ అధికారి ఒకరైతే… షాడో రవాణా శాఖ అనధికారులుగా ఆ నలుగురి కొనసాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్టీఏ ఆఫీసుల్లో నేరుగా వచ్చిన వారి ఫైళ్లు పెండింగ్ లో పడుతుంటే..
ఏజెంట్ల ద్వారా వచ్చిన ఫైళ్లే వేగంగా అప్రూవ్ అవుతున్నాయి. ఏజెంట్ల ఫైళ్లకు ఓ ప్రత్యేక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ చూస్తే అది ఏజెంట్ పని అని గుర్తించేస్తారు. ఏజెంట్ ద్వారా వచ్చిన ఫైళ్లను ఏం అడగకుండా ఓకే చేసేస్తారని వాహనదారులు చెపు తున్నారు.
సాయంత్రం అయితే ఏజెంట్లు వారికి సహకరించిన ఆ నలుగురి ద్వారా వసూళ్ల లెక్కలు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో సెక్షన్ లో తమ విధులని ఆ నలుగురు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
నామమాత్రంగా లైసెన్సు ఎగ్జామ్..!లెర్నింగ్ లైసెన్స్ కోసం నేరుగా వచ్చిన వారికి కంప్యూటర్ పరీక్ష పెడుతున్నారు. అయితే ఏజెంట్ల ద్వారా దరఖాస్తు చేసిన వారికి నామమాత్రపు టెస్ట్ ద్వార లెర్నింగ్ లైసెన్స్ ఇస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు.
నేరుగా వచ్చినవారి టెస్టు రిజల్ట్ను ఫెయిల్ చేసి.. మళ్లీ ఫీజు చెల్లించి అప్లై చేయాలని చెబుతున్నారని సమాచారం. అయితే కాళ్ళరిగేలా తిరిగినా పని అవ్వకపోవడం తో కొందరు వాహనదారులు మళ్ళీ ఏజెంట్లు లేదా బ్రోకర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రభుత్వ ఆదాయానికి గండిఇలా అక్రమంగా ఆ నలుగురు వసూలు చేసిన డబ్బులు అధికారి జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి టాక్స్ రూపం లో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది.
ఆర్టీఏ వ్యవస్థ అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేస్తున్నారు. అనధికారికంగా ఉన్న ఆ నలుగురు అనధికారులపై సంబంధిత శాఖ అధికారులు నిఘా వేయాలని స్థానికులు కోరుతున్నారు..
