HomeTelanganaNizamabadకాంగ్రెస్ లో నామినేటెడ్ సంబరం ......పార్టీ ప్రభుత్వ పదవుల పంపకాల్లో సీనియర్లకె అందలం

కాంగ్రెస్ లో నామినేటెడ్ సంబరం ……పార్టీ ప్రభుత్వ పదవుల పంపకాల్లో సీనియర్లకె అందలం

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్న అధికార పార్టీ నామినేటెడ్ పదవుల పందేరానికి తెరలేపింది. పార్టీ పదవుల తో పాటు ప్రభుత్వ హోదా ఉన్న పదవు ల్లో సీనియర్ నేతలకే ప్రాధాన్య దక్కింది.

ఇటీవల పీసీసీ చేపట్టిన నియామకాల్లో సీనియర్ నేతలకే అవకాశం దక్కింది. సీనియర్ నేత గా ఉన్న రాంభూపాల్ కు పీసీసీ ప్రధాన కార్యదర్శి గా రామకృష్ణ కు క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా నియామకం అయ్యారు.

పీసీసీ లో చోటు కోసం జిల్లా నుంచి దాదాపు అరడజన్ మంది నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు. అయినప్పటికీ మహేష్ గౌడ్ కేవలం సీనియార్టీ తో పాటు విధేయత కే పట్టం కట్టారు.డీసీసీ, నగర అధ్యక్షుల నియమాకాల్లోనూ ఇదే జరగబోతుంది.

తాజాగా నామినేటెడ్ పదవుల నియామకాలు సైతం జరిగాయి. ఏళ్ళ తరబడిగా పార్టీ లో కొనసాగుతున్న నేతలకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. సంతోషి మాత ,జండా బాలాజీ శంభు లింగం గుడి లకు పాలక వర్గాలను ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది.

ఈ మూడు ఆలయాలకు ఛైర్మెన్ లుగా పార్టీలో సీనియర్ నేతలుగా ముద్ర ఉన్నవారినే నియమించారు. జండా గుడి కి లవంగం ప్రమోద్ ను అలాగే శంభూ గుడి ఛైర్మెన్ గా పూసలగల్లి మధు నియామకం అయ్యారు. గతంలో కనీసం మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ కూడా దక్కని నేతలకు ఈసారి అధికార పార్టీ పెద్దలు అందలం దక్కేలా చూసారు.

ఆలయ కమిటీ లకు ఛైర్మెన్ పదవుల కోసం పార్టీలో చేరిన నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు. పదేళ్ల తరవాత అధికారంలోకి వచ్చాక తమకు ఇప్పటికైనా అందలం దక్కుతుందని సీనియర్ నేతలు సంబర పడ్డారు కానీ బిఆర్ యస్ లో ఉండి అనేక దందాలు ..

పదవులు పొందిన నేతలు అసెంబ్లీ ఎన్నికల తరవాత కాంగ్రెస్ పార్టీలోకి వరద లా వచ్చేసారు. దీనితో బిఆర్ యస్ లో చక్రం తిప్పిన వారితో కాంగ్రెస్ కళకళ లాడింది. మరో వైపు సీనియర్ నేతలకు పదవుల బెంగ పట్టుకుంది.

కొత్త నేతల హడావుడి చూసి బెదిరిపోయారు. సీనియర్ నేత లవద్ద వీరే హడావుడి చేయడం పదవుల పందేరం నీలి నీడలు అలుముకున్నాయి.

కానీ సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అందుకు తగ్గట్టుగానే పార్టీ ప్రభుత్వ పదవుల నియామకాలు జరగడంతో సీనియర్ నేతలు ఊరట చెందుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments