HomeLaw and Orderకలెక్టర్ సార్... పిఎ పై చర్యలు తీసుకోరా...?కలెక్టర్ సార్... పిఎ పై చర్యలు తీసుకోరా...?

కలెక్టర్ సార్… పిఎ పై చర్యలు తీసుకోరా…?కలెక్టర్ సార్… పిఎ పై చర్యలు తీసుకోరా…?

అని, సుప్రీంకోర్టు ఇచ్చిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి, విద్యార్థులకు నాణ్యమైన సక్రమమైన విద్యని అందించేలా చూడాలని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఏంఎస్పీ) జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు నియమ నిబంధనలను ఒక్కో అధికారికి ఒక్కోరకంగా ఉంటుందా…?

అందరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కచ్చితంగా అందరూ కట్టుబాట్ల తోనే ముందుకు వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది, అది ఏవిధంగా అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఓ ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది, అదే నియమనిబంధన ప్రకారం ఓ జిల్లా కలెక్టర్ ని నియమించడం జరిగింది.

కానీ ఇక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని నియమ నిబంధనలను , సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేకతారు చేస్తూ ఓ ఉపాధ్యాయుడు వ్యవహరిస్తున్నాడు.

అది ఎలా అంటే ప్రజా ప్రతినిధులకు పర్సనల్ అసిస్టెంట్ (పిఎ) గా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండకూడదని, 2016 సెప్టెంబర్ 7న విద్యార్థుల హక్కులను కాలరస్తుందని , విద్య హక్కు చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వేలువరించింది.

అయినను దానికి విరుద్ధంగా ధర్పల్లి మండలంలోని మైలారం గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్న గడ్డం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పాఠశాలకు వెళ్లకుండా సెలవులు పెడుతూ ప్రజా ప్రతినిధి వద్ద పిఎ గా వ్యవహరిస్తున్నారు అని పలు దినపత్రికలలో కథనాలు రావడం జరిగిందని అన్నారు.

ఇప్పటికైనా ఆ విషయాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు సరైన సక్రమమైన విద్య అందించే విధంగా ఆ ఉపాధ్యాయుడు పైన కలెక్టర్ చర్యలు తీసుకుని, ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు విద్యను అందించాలని కోరుతున్నామ ఇకార్యక్రములో ఏంఎస్పీ, పట్టణ అధ్యక్షులు శీలంయాదగిరి మాదిగ కాందేశి నవీన్, ప్రవీణ్, తదితరులు పాలొగొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments