ప్రస్తుత కాలానికి అనుగుణంగా వస్తున్న నూతన పద్ధతులను ఉపయోగిస్తూ కేసులదర్యాప్తుల్లో సత్వర చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,పిలుపు నిచ్చారు.
శుక్రవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాలులో పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణను నేడు ప్రారంభిచారు .
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో గల కేసుల యొక్క పరిశోధనలో నాణ్యతను పెంచి ఎఫ్.ఐ.ఆర్ నుండి చార్జ్ షీట్ రిపోర్టు వరకు ఉండవలసిన మెలకువలు గురించి అనగా ఎఫ్.ఐ.ఆర్ , పంచనామా , నేరస్తుల ఒప్పుకోలు పంచనామ స్టేట్మెంట్ రికార్డు చేయు విధానము మరియు గోప్యత పాటించాలని అటువంటి విషయాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది.
నూతన చట్టాలపై అవగాహన కల్పించి జరిగినటువంటి నేరానికి మరియు నేర స్థలానికి జత చేయడం విషయాలను నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో ఏ ఏ పద్ధతులని వాడవలెను తెలియజేశారు పాత కేసుల యొక్క విచారణలో ఉన్నటువంటి విషయాలు తెలియపరచి చార్జ్ షీట్ రిపోర్టు కోర్టులలో సమర్పించె వరకు ఫారిన్సిక్ సైన్స్ ను వాడుకునే విధివిధానాలను మరియు కోర్టులో వేసే చార్జ్ షీట్ తయారుచేసి విధివిధానాలను కూడా తెలియజేయడం జరిగింది.
శిక్షణను మూడు రోజులపాటు నిర్వహించనున్నారు తదుపరి స్టేషన్ రైట్స్ సంబంధిత పోలీస్ స్టేషన్లో వెళ్లిన తర్వాత తమ సిబ్బందికి సంబంధిత అధికారికి శిక్షణ కాలంలో నేర్చుకుంది సవివరంగా వివరించి తెలియజేయాలి అని తెలియజేశారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసులలో పరిపక్వతను సాధించాలని హితువు పలికారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) శ్రీ బస్వా రెడ్డి మరియు ట్రైనింగ్ సి టి సి ఎ సి పి శ్రీ మస్తాన్ అలీ, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
