జిల్లాలో శాంతిభద్రతల కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, తద్వారా అనుమానితులు, చోరీలకు గురైన వాహనాలు బయటపడే అవకాశాలు ఉన్నందున దీనికి అందరూ సహకరించాలని పోలీసులు ప్రజలను కోరారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఒకట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కోజ కాలనీ, మాలపల్లి ప్రాంతంలో సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజల తలుపులు తడుతుంటే ఏమైందోనంటూ కొంతమంది భయపడ్డారు. వీరు తలుపులు తీసేందుకు సందేహం వ్యక్తం చేయగా, ఈ ప్రాంతాలకు చెందిన వారితోనే పోలీసులు తలుపులు తెరిపించి వారిని భయటకు రప్పించారు.
అనంతరం పోలీసులు వారికి అసలు విషయాలు తెలుపుతూ వారి వివరాలు, వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.నేరాల నియంత్రణ కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు.
దీని ద్వారా కొద్దిగనైనా నేరాలు అదుపులో ఉంటాయన్నారు. ఎవరూ ఎలాంటి పరిచయం లేనివారికి తమ ఇండ్లు అద్దెకు ఇవ్వరాదన్నారు.
కొత్త వ్యక్తులకు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. అనుమానితులు కాలనీలో తిరుగుతుంటే వారి సమాచారం తెలుసుకుని దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
