HomeTelanganaNizamabadప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 420 హామీలపై ప్రశ్నిస్తే అక్రమ...

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 420 హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు

శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నారై సెల్ పై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిలదీస్తే ఇంటిపై దాడి చేశారని అన్నారు .

ఒక ఎమ్మెల్యే ఇంటికి కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా ప్రవేశించడమే కాకుండా వీడియోలు తీయడం సమంజసం కాదన్నారు.తమ ఎమ్మెల్యే ఇంటికి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిని స్వీయరక్షణ లోనే భంగమగా తరిమిపంపమని స్పష్టం చేశారు. అలాంటిది ఆయనను వదిలేసి తమ కార్యకర్తలపై కేసులు వేయడం సిగ్గుచేటు అన్నారు.

కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారన్నారు.మా కార్యకర్తల పై ఇష్టం వచ్చినట్లు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

గత కెసీఆర్ హయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే ఇప్పుడు ఎనిమి పోలీసింగ్ గా మారిందని అన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది అరెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.

రెండు జాతీయ పార్టీలు అభివృద్ధిపై కాకుండా నాయకుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయని విమర్శించారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠల్, బాజిరెడ్డి జగన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments