భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు బీజేవైఎం జిల్లా ఇన్‌చార్జిలను ప్రకటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌కు చెందిన బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణను నిర్మల్ జిల్లా బీజేవైఎం ఇన్‌చార్జిగా నియమించారు.
అమంద్ విజయ్ కృష్ణ గతంలో బీజేవైఎంలో పలు బాధ్యతలు నిర్వహించారు. ప్రజా, విద్యార్థుల సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
యువతను సంఘటితం చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని అమంద్ విజయ్ కృష్ణ తెలిపారు. నిర్మల్ జిల్లాలో బీజేవైఎంను బలోపేతం చేయడంతోపాటు యువతను పార్టీతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
