పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ కు ట్రాఫిక్ హోంగార్డు జీవన్ సింగ్ మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే..
నగరంలోని వీక్లీ మార్కెట్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను గమనించి వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్ చేసి సమాచారం అందించారు.అప్పటికే తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్న సదరు మహిళను చూసి స్థానిక మహిళలను పిలిపించారు.
దీంతో ఆమె రోడ్డు పక్కనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.అంబులెన్స్ రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.స్థానికులు హోంగార్డు జీవన్ సింగ్ ను అభినందించారు.
