రైతుల సాగుకు ఆధారమైన గోదావరి మంజీరా లకు జలకళ సంతరించుకుంది భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి మంజీరా గోదావరిలోకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది
మరోవైపు వాగుల నుంచి పరుగులు పెడుతున్న వర్షపునీరు మంజీరా గోదావరిలోకి చేరుతుండడంతో క్రమేపి వరద నీటిమట్టం పెరుగుతుంది రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరిలో నీటి ప్రవాహం కొద్ది కొద్దిగా పెరుగుతుంది
ఎక్కువ ప్రాంతంలోని పసుపు వాగు గూండ్ల వాగు నాగంపల్లి వాగు పెగడపల్లి వాగు ఎడపల్లి వాగుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో కందకుర్తి వద్ద గోదావరిలో జలకల సంతరించుకుంటుంది
పోతంగల్ సాలూర మండలాలలోని మంజీరా వాగులోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో మంజీరా లో నీటి ప్రవాహం పెరిగింది
పోతంగల్ శివారులోని వంతెన వద్ద మంజీరా లో వరద ఉధృతి పెరిగింది సాలురా మండల కేంద్రంలోని సాలూరు వంతెన వద్ద మంజీరా లో వరద నీరు క్రమేపీ పెరుగుతుంది
