HomeCRIMEకొప్పెర్గ మీదుగా నగరానికి యథేచ్ఛగా ........నాగారంలో డంప్ ........టిప్పర్ ని వదిలేసి పారిపోయిన డ్రైవర్ .......తెరవెనుక...

కొప్పెర్గ మీదుగా నగరానికి యథేచ్ఛగా ……..నాగారంలో డంప్ ……..టిప్పర్ ని వదిలేసి పారిపోయిన డ్రైవర్ …….తెరవెనుక గులాబీ నేత

బహిరంగ మార్కెట్ లో ఇసుక అందుబాటు లో లేక పోవడంతో భారీగా నిల్వ లు చేసి రాబోయే రోజుల్లో సొమ్ము చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇసుక డంప్ లకు జిల్లా కేంద్రం నే అడ్డాగా చేసుకున్నారు.

నగరానికి నాలుగు వైపులా ఇసుక డంప్ లను గుట్టుగా కొనసాగిస్తున్నారు. నగరంలోని నాగారంలో సమీపంలో ఓ ఫంక్షన్ హల్ వెనుక డంప్ ను ఏర్పాటు చేసారు.

బోధన్ మండలం పరిధి లోని కొప్పెర్గ నుంచి మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అర్ద రాత్రి ఇసుక ను నగరానికి గుట్టుగా తరలించి డంప్ చేస్తున్నారు. నగరానికి చెందిన ఓ మాజీ బిఆర్ యస్ నేత తెరవెనుక ఉండి ఇసుక దందా కు తెరలేపారు.

రోజు రాత్రి 11 గంటల నుంచి ఇసుక టిప్పర్లు నగరంలో ఆయా విధుల్లో సందడి చేస్తున్నాయి సమయ పాలన పాటించని వ్యాపారు విషయంలో ఉక్కుపాదం మోపుతున్న పెట్రోలింగ్ పోలీసులు రయ్యున దూసుకొచ్చే ఇసుక టిప్పర్ల విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వుంటున్నారు.

సదరు నేత ముందే నగర పోలీసుల తో బేరం కుదుర్చుకొని ఇసుక దందా లోకి దిగారట.బోధన్ ఎడపల్లి మీదుగా నగరంలోకి వస్తున్నా ఇసుక టిప్పర్లు ఆరో రెండు టౌన్ ఠాణాలు దాటుకొని ఐదో టౌన్ పరిది లోకి వచ్చే నాగారం కు చేరుతున్నాయి.

గురువారం అర్ద రాత్రి మూడు ఇసుక టిప్పర్లు ను రెండో టౌన్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో పట్టుకునే యత్నం చేసారు. కానీ టిప్పర్లు ముందు ఉండే ఎస్కార్ట్ గ్యాంగ్ అప్రమత్తం చేయడం తో రెండు టిప్పర్లు గల్లీ ల్లో చొరబడి మాయం అయ్యాయి.

మరో టిప్పర్ మాత్రం పెట్రోలింగ్ పోలీసులకు చిక్కింది కానీ సదర్ ఇసుక మాఫియా కు చెందిన ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి సైగ చేయడంతో టిప్పర్ ను అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు.

పోలీసుల ఆదీనంలో ఉన్న టిప్పర్ ను విడిపించడానికి బైక్ మీద వచ్చిన యువకుడి అరగంట ఫోన్ ప్రయత్నించారు చివరికి టిప్పర్ ను రెండో టౌన్ కు తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments