HomePOLITICAL NEWSArmoorభీంగల్ లో... పత్తలాట 'లొల్లి' - పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ కాంగ్రెస్ నేత ..?-...

భీంగల్ లో… పత్తలాట ‘లొల్లి’ – పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ కాంగ్రెస్ నేత ..?- అధికార పార్టీ ఇద్దరు నేతల మధ్య లోపించిన సమన్వయం – చర్చనీయాంశంగా మారిన వివాదం

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పత్తలాట పంచాయతీ రోజురోజుకు ముదురుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత పేకాట ఆడుతూ పట్టుబడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

దీనిని కప్పి పుచ్చుకోనేందుకు సదరు కాంగ్రెస్ నేత పడ రాని పాట్లు పడిన నివురు గప్పిన నిప్పులా ఈ అంశం బయటికి పొక్కడంతో… బాల్కొండ నియోజకవర్గంలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

బాల్కొండ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఇద్దరు నేతలు భీంగల్ మున్సిపల్ లో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీని శాసించే స్థాయిలో.. పావులు కదుపుతున్నారు .

అయితే అందులో ఒకరు గత శనివారం రాత్రి పేకాట ఆడుతూ టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడినట్టు సమాచారం . ఈ వివాదం నుంచి తప్పించుకునేందుకు సదరు భీంగల్ మండల కేంద్రానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి అధికార యంత్రంగాన్ని మేనేజ్ చేసుకోవడానికి నానా తంటాలు పడ్డట్టు తెలుస్తోంది‌ ఈ క్రమంలో ఈ అంశాన్ని బయటకు చేరవేస్తే రాజకీయంగా తనకు లభిస్తుందని భావించిన మరో నేత..

దీనిని ప్రాపగండ చేయడంతో కాంగ్రెస్ లో రాజకీయరచ్చ తారాస్థాయికి చేరుకుంది. అసలే బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మున్సిపల్ లో గులాబీ వర్సెస్ హస్తం అన్న చందంగా ఉన్న తరుణంలో స్థానిక ఎన్నికలకు ముందు ఈ పంచాయతీ కాంగ్రెస్ లో ఈ రాజకీయ రచ్చ పార్టీకి తీరని నష్టం మిగిల్చేలా ఉంది.

ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాల్కొండ నియోజకవర్గస్థాయి రాష్ట్రస్థాయి నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. మరి అంశాన్ని ఎలా డీల్ చేస్తారో వేసి చూడాల్సిందే..!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments