రాఖీ పండుగ సందర్భంగా అక్కతో రాఖి కట్టించుకొని తిరిగి వెళ్తూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన నవిపేట్ మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..
నిర్మల్ జిల్లా బాసర కు చెందిన సాయిబాబు (19).రాఖీ పండుగ సందర్భంగా అక్కతో రాఖీ కట్టించుకోడానికి నిజామాబాద్ వెళ్ళాడు.
రాఖీ కట్టించుకొని తిరిగి ప్రయాణంలో నవీపేట్ మండలంలోని జగ్గయ్య ఫారం వద్ద ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీ కొని అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.మరొక మిత్రుడికి స్వల్ప గాయాలయ్యాయి.
