నగరంలోని సాయి బాబ ఆలయంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. ఈ ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే..గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో అర్ధరాత్రి దొంగలు చొరబడి ఆలయంలోని వెండి కిరీటం, ఇత్తడి సాయిబాబా విగ్రహం, ఇత్తడి సామగ్రి అపహరించినట్లు తెలిపారు.
శుక్రవారం ఆలయ అర్చకులు గుడికి వెళ్ళి చూడగా సాయిబాబా విగ్రహంతో సహా వస్తువులన్నీ కనిపించక పోవడంతో స్థానిక 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందజేశారు.
ఈ మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.
