ఈ రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో గుపన్ పల్లి గ్రామం లోని గంగస్థాన్ ఫేస్–2 లో గల శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ శర్మ మాట్లాడుతూ ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచాంబృతాలతో అభిషేకం నిర్వహించామని, ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కావున అమ్మవారికి మల్లెపూల తో అలంకరణ చేశామన్నారు, ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు.
ఈ వ్రతం అందరూ భక్తులు తమ తమ ఇళ్లలో కూడా నిర్వహించు కోవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రమణ రావు,వేణు, మయూరి ,కవిత, స్వప్న,లతా, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు అని తెలిపినారు
