HomeDevotionalశాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి..నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి..

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి..నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి..

రాబోయే వినాయక చవితి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.

ఈ సందర్భంగా శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ యందు వినాయక చవితి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి, నేరాల మీద వాటి నియంత్రణ కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ మండప నిర్వాహకులకు కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. విగ్రహాలను, వివాదాస్పద ప్రదేశాలలో మరియు ప్రజలు తిరిగే రోడ్ల పైన గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదని,ట్రాఫిక్ ఎటువంటి అడ్డంకులు కలిగించరాదనీ పేర్కొన్నారు.

పశువులను గణేష్ మండపముల దగ్గరికి రానివ్వకూడదు. వీధి కుక్కలు వగైరా మండపంలోని దీపాలను కిందపడవేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలనీ సూచించారు. భక్తుల వాహనాలను పార్కింగ్ కొరకు తగినంత దూరంలో నిర్దేశించిన ప్రదేశంలోనే ఉంచవలెను.

మండపాల వద్ద వాలంటీర్లకు తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డు ఉండే విధంగా చూడాలనీ అన్నారు.అలాగే మండపాల వద్ద టపాకాయలను ఇతర మందు గుండు సామాగ్రిని ఉంచరాదన్నారు.

మండపాల వద్ద సీ.సీ కెమెరాలు తప్పనిసరిగా ఉంచవలెను. స్థానిక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏ.సి.పి) అనుమతి లేనిదే మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు వినియోగించరాదనే హెచ్చరించారు.

మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి కరెంట్ కనెక్షన్ తీసుకొనవలేని తెలిపారు.

లౌడ్ స్పీకర్ల ను విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ/ ప్రైవేటు కార్యాలయాలకు, ప్రార్థన మందిరాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.

పోలీస్ సిబ్బందికి కొన్ని ముఖ్య సూచనలు.సున్నితమైన సమస్యత్మకమైన మరియు అత్యంత సమస్యత్మకమైన ప్రాంతాలలో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయలన్నారు.

అనుమానాస్పద వ్యక్తుల పైన గట్టి నిఘ ఉంచవలెను, వర్షాకాలం కావున పోలీస్ సిబ్బంది అందరూ రెయిన్కోట్ దగ్గర ఉంచుకోవాలానే తెలిపారు.రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు ఉపయోగించకుండా చూడాలి, మండపాల వద్ద బాణసంచా పేల్చకుండా చూసుకోవాలనీ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) శ్రజి.బస్వరెడ్డి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, ఏ.సీ.పీలు.రాజా వెంకట్ రెడ్డి, పి.శ్రీనివాసులు, వై.వెంకటేశ్వర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ P. శ్రీశైలం, CCRB ఇన్స్పెక్టర్ ఎస్.సతీష్ కుమార్, , సీ.ఐలు, ఎస్సైలు, ఐ.టి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments