సహజీవనం చేసేందుకు నిరాకరించిందని ఓ మహిళను హత్య చేసిన ఘటనలో నిందితుడ్ని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..
ఈ నెల 6 వ తేదీన రైల్వే స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మృతురాలు కామారెడ్డి జిల్లా లింగాయపల్లి కి చెందిన గులాల సవిత గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
అలాగే దర్యాప్తులో సవిత తో గన్నారం గ్రామానికి చెందిన పల్లె రాకేష్ నవీన్ సహజీవనం చేస్తున్నట్లు తెలిసిందన్నారు.
దీంతో పల్లె రాకేష్ నవీన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తనతో సహజీవన కొనసాగించడానికి నిరాకరించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.
