భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దులో పరిస్థితులఫై అధికారులు అప్రమత్తం అయ్యారు.
పోతంగల్ మండలం కొల్లూరు దోమలేడిగి గ్రామాలలో వంతెనలను శనివారం అధికారుల బృందం పరిశీలించింది తాసిల్దార్ గంగాధర్ ఇన్చార్జ్ ఎంపీడీవో చందర్ ఆధ్వర్యంలో అధికారులు లో లెవెల్ వంతెనలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు భారీ వర్షాల కారణంగా వరద నీటితో లో లెవెల్ వంతెనలు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు రాకపోకలు సాగించవద్దని సూచించారు
వర్షాల కారణంగా వరద నీరు వస్తుండడం వల్ల అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని లేనట్లయితే ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు లో లెవల్ వంతెనల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్థాయి అధికారులను ఆదేశించారు
