HomeTelanganaNizamabadముసురుకున్న వాన. రోడ్లు జలమయం..

ముసురుకున్న వాన. రోడ్లు జలమయం..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది.

ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం క్రమంగా భారీగా మారింది. దీంతో నగరం దాదాపు జలమయం అయింది.

దీంతో భారీగా వరద నీరు చేరి రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

లోతట్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం కురిసిన వర్షం 660.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

అత్య ధికంగా కోటరిలో 63.5, వర్ని 53, ముగ్పాల్ 45,రుద్రూర్ 43, మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అత్యల్పంగా సాలూరు 4.0, నందిపేట 5.2,బోధన్ 5.8, మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు.

మరో రెండు రోజుల పాటు జిల్లాకు వర్ష సూచన ఉందని జిల్లా అధికారులు తెలిపారు. భారీ వర్షాలొస్తే ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసరమైతేనే వెళ్లాలని శాఖల వారీగా అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేశారు.

ప్రజల సహాయార్థం జిల్లా నీటి పారుదల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 08462-221403 నంబరును సంప్రదించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments