నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ బదిలీ వ్యవహారం అధికార పార్టీలో దుమారం రేపుతోంది. ఇదో రాజకీయ రచ్చగా మారింది.
నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న దిలీప్ కుమార్ బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో వెయింటింగ్ లో ఉన్న ఎన్. యాదగిరి రావు ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ప్రభుత్వం నియామకం చేసింది.
దిలీప్ కుమార్ కమిషనర్ గా నియామకం ఇంకా ఏడాది కాలం కూడా పూర్తీ అవ్వకుండా నే బదిలీ కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
మరో వైపు అధికార పార్టీ లో దుమారం రేపింది . మున్సిపల్ శాఖ ముఖ్య మంత్రి రేవంత్ పర్యవేక్షణ లో వుండడంతో ఉన్నతాధికారులే రాష్ట్ర వ్యాప్తంగ 42 కమిషనర్ లను బదిలీ చేసారు.
ఇందులో భాగంగా యాదగిరి రావు కు పోస్టింగ్ ఇవ్వడమే లక్ష్యంగా కీలకమైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీ చేసారు.కానీ అనూహ్యంగా జరిగిన ఈ బదిలీ అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపింది కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా బదిలీ చేసారంటూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ …
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ లు రగిలి పోయారు నేరుగా సీఎంవో ను సంప్రదించి బదిలీ ఆక్షేపించారు.అయినా ప్రస్తుతం ఉన్న కమిషనర్ దిలీప్ ఇప్పుడిప్పుడే కార్పొరేషన్ వ్యవహారాలు చక్క బెడుతుంటే ఉన్నపలంగా ఎలా బదిలీ చేస్తారని ఆ నేతలు మండిపడుతున్నారు
కొత్త కమిషనర్ వస్తే కార్పొరేషన్ లో పాలనా మళ్ళీ మొదటికి వస్తుందనేది వారి వాదన ! అధికార పార్టీలో అగ్ర నేతలు ఆగ్రహం తో వెనక్కి తగ్గినా సీఎంవో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
గురువారం మంచి రోజు కావడంతో బాధ్యతలు చేపట్టడానికి హైదరాబాద్ నుంచి బయలు దేరిన యాదగిరి రావు కామారెడ్డి దాక వచ్చారు కాసేపట్లో బాధ్యతలు తీసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి
కానీ ఈలోపు సీఎంవో నుంచి ఫోన్ వచ్చింది. బాధ్యతలు తీసుకోవద్దని చెప్పారు దీనితో ఆయన కామారెడ్డి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
