నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తూ మండలి ఛైర్మెన్ కు లేఖ రాసారు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కవిత ను బిఆర్ యస్ నుంచి సస్పెండ్ చేసారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ గా రెండు పర్యాయాలు ఎన్నికైన కవిత పదవి కాలం 2028 దాక ఉంది. గతంలో భూపతి రెడ్డి రాజీనామా తో ఖాళీ అయినా ఎమ్మెల్సీ స్థానం లో ఎంపీ గా ఓడిపోయిన కవిత కు అవకాశం ఇచ్చారు. 2022 లో పదవి కాలం పూర్తీ కాగానే మరోదఫా ఎమ్మెల్సీ గా ఆమె కె అవకాశం ఇచ్చారు.
ఎమ్మెల్సీ గా గెలవడానికి ఇతర పార్టీలకు ఎంపిటిసి జెడ్పిటిసి కార్పొరేటర్ కౌన్సిలర్ లను గంపగుత్తగా కొనుగోలు చేసి బిఆర్ యస్ లోకి చేర్చుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ నేతలు బిఆర్ యస్ తీరు ను ఎండగట్టారు.
కానీ అప్పటికే లోకసభ ఎన్నికల్లో కవిత ఓటమి నింద ను ఎదురుకున్న ఎమ్మెల్యే లు కవిత ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీ కోసం పోటాపోటీగా యంపిటీసీ జెడ్పిటిసి కౌన్సిలర్లు కార్పొరేటర్ల ను ఇతర పార్టీ ల నుంచి సొంత ఖర్చులతో కొనుగోలు చేసారు.కానీ ఎమ్మెల్సీ గా ఎన్నికైన ఏడాదికే ఆమె లిక్కర్ కేసులో జైలు కు వెళ్లారు.
బెయిల్ మీద జైలు నుంచి వచ్చిన ఆమె జిల్లాకు చుట్టపు చూపు గా వచ్చి వెళ్తున్నారు.కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఆమె ఏ నాడు జెడ్పి మున్సిపల్ సర్వసభ్య సమావేశాలకు హాజరు కాలేదు.పార్టీ అధికారం కోల్పోయాక దాదాపు జిల్లాకు అరుదు గా వచ్చారు.
