3 లక్షల బైండ్ ఓవర్ పూచీకత్తు నగదు జప్తుకు తహసీల్దార్ ఆదేశం..
బైండ్ ఓవర్ నిబంధనలను అతిక్రమించి భారీ సౌండ్ తో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న రెండు డీజే యజమానులపైన కేసు నమోదు చేసి డీజేలు సీజ్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నవిపేట్ మండలం నిజాంపూర్ గ్రామంలో మంగళవారం మధ్య రాత్రి రెండు డీజే సిస్టంలు పరిమితికి మించి సౌండ్ పెట్టి, ప్రజలకు ఇబ్బంది చేయగా, డీజే లను సీజ్ చేసి డీ జే యజమానులు ధారావత్ రమేష్ , గంగాధర్ R/o మట్టాయఫారం, పుల్ల అరవింద్ R/o షాపూర్, నందిపేట్ ల పైన రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ధారావత్ రమేష్ ను గంతలో కూడా తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయగా,అయిన ఆ నిబంధనలు అతిక్రమించినందుకు బుధవారం నవీపేట్ తహసీల్దార్ వద్ద హాజరు పరచి, బైండ్ ఓవర్ చేసిన పూచీకత్తు నగదు 3 లక్షల జప్తు కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా సరైన అనుమతులు లేకుండా డీ.జే లు ఉపయోగించిన, మద్యం సేవించడం వంటి చట్ట విరుద్ధ చర్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకొబడునాని నిజామాబాద్ నార్త్ రూరల్ సి . ఐ శ్రీనివాస్, ఎస్.ఐ నవీపేట్ తిరుపతి తెలిపారు. అందరూ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులకు సహకరించాలన్నారు.
