ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కాసేపట్లో కామారెడ్డి జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందు జాగ్రత్తగా బిఆర్ యస్ బీజేపీ నేతలతో ప్రజాసంఘాలప్రతినిధులను తెల్లవారు జామునే అదుపులోకి తీసుకోని ఆయా ఠాణా లకు తరలించారు.
తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ వద్ద ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్ దిగేందుకు హెలిపాడ్ ను సిద్ధం చేసారు . అక్కడి నుంచి రోడ్డు మార్గాన
లింగంపేట్కు వెళ్లారు.
వర్షాలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు వంతెనను ముఖ్యమంత్రి పరిశీలించే ఛాన్స్ ఉంది .
బుడిగిడా గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి ముఖ్యమంత్రికి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు తెలుసు కోనున్నారు.
మొదట పోచారం ప్రాజెక్టు ను సైతం పరిశీలిస్తారని భావించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం లోనే
కామరెడ్డి కి చేరుకుంటారు.
పట్టణంలోని జి ఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శ చేయనున్నారు
ఆ తర్వాత కలెక్టరేట్ లో అధికారులతో వరదలపై సమీక్ష, ఫోటో ఎగ్జిబిషన్, ను సైతం సీఎం చూడనున్నారు.
వరద తాకిడికి గురైన ప్రాంతాలకు సీఎం ఇప్పటికే పది కోట్ల రూపాయల తాత్కాలిక ఆర్థిక సహాయ ప్రకటించారు అయితే సీఎం స్వయంగా చూసిన తర్వాత వరద సహాయం మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు ఆశాభావం తో ఉన్నారు
/// ట్రాఫిక్ డైవర్షన్ – ///
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నగరంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 03:00 గం.
కామారెడ్డి పట్టణంలో తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయనున్నారు .
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించి వెళ్లాలని , ట్రాఫిక్ పోలీసుల కోరుతున్నారు
