ఖైరతాబాద్ 69 అడుగుల మహా గణేష్ కొద్దిసేపటి క్రితమే హుస్సెన్ సాగర్ చెంతకు చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద మహా గణపతిని ఈసారి భారీ క్రేన్ లసహాయంతో నిమజ్జనం చేశారు.
బడా గణేష్ నిమజ్జనం జరగడంతో నిన్నటి నుంచి భారీ ఏర్పాట్లు చేస్తున్న హైదరాబాద్ గణేష్ ఉత్సవ మండలి, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యేందుకు వేలాది వినాయకులు హుస్సేన్ సాగర్ కు తరలివచ్చారు . దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయాయి
