HomeTelanganaNizamabadకవిత విజ్ఞత కే వదిలేస్తున్న .....హరీష్ కౌంటర్ ...........లండన్ నుంచి హైదారాబాద్ చేరుకున్న హరీష్

కవిత విజ్ఞత కే వదిలేస్తున్న …..హరీష్ కౌంటర్ ………..లండన్ నుంచి హైదారాబాద్ చేరుకున్న హరీష్

బిఆర్ యస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తనమీద చేసిన ఆరోణలకు మాజీ మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు.

నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది.గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది.

ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలుసన్నారు

రాష్ట్రంలో ఒకవైపు ఎరువులు దొరకక రైతులు గోస పడుతుంటే, మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు.

కేసీఆర్ పదేళ్ల కాలం లో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం.

ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే మా దృష్టి అంతా ఉంటుంది.కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments