HomeTelanganaNizamabadస్నేహితుల గాజుల సవ్వడి

స్నేహితుల గాజుల సవ్వడి

స్నేహితుల గాజులు” అనేది స్త్రీలు తమ స్నేహితులతో కలిసి గాజులను మార్చుకుంటూ, గోరింటాకు పెట్టుకుని, కలిసి భోజనాలు చేసుకుంటూ జరుపుకునే ఒక సాంఘిక సంబరాన్ని సూచిస్తుంది. ఈ సంబరాలు స్నేహబంధాలను పదిలం చేసుకుని, వాటిని ఒక దృఢమైన బంధంగా మార్చుకోవడం ఈ సంబరం ముఖ్య ఉద్దేశ్యం.

ఇది స్నేహం ఎప్పుడూ విడిపోని బంధం అని గుర్తు చేస్తుంది. నిజామాబాద్‌లోని బొబ్బిలి వీధి లో గల్లీ గణేష్ మండలి ప్రాంగణంలో ఈ సంబరాన్ని ఘనంగానిర్వహించుకున్నారు. అనంతరం ఆటపాటలతో కోలాహలంగా గాజుల సంబరాన్ని చేసుకొని మురిసిపోయారు.

మహిళలు కబడ్డీ, ఖో ఖో, దాండియా, డాన్స్ లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాధిక, సాధన, హర్షిత,రంజిత, లత, స్వప్న, స్రవంతి, వెన్నెల, నవనీత, శ్రావ్య, కాజోల్, అక్షర, లావణ్య, అరుణ, కవిత, కమల మరియు గల్లీ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments