నిజామాబాద్ నగరానికి చెందిన జర్నలిస్టు హరికృష్ణ కు దళిత రత్న అవార్డు దక్కింది. నిరంతరం దళిత సమాజం కోసం పోరాడుతుఉన్నందుకే గుర్తింపుగా హరికృష్ణకు ఈ అవార్డ్ దక్కింది.
ఈ మేరకు హైదారాబాద్ లో ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదుగా దళిత రత్న అవార్డుతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఇటుక రాజు మాదిగ మాట్లాడుతూ, “దళిత సమాజం, ముఖ్యంగా మాల–మాదిగలు ఎదుర్కొంటున్న అన్యాయం, అణచివేతపై హరికృష్ణ గళమెత్తి, తన కాలం నే ఆయుధంగా మార్చుకుని ఎప్పటికప్పుడు సమాజానికి అండగా నిలుస్తున్నారు.
ముఖ్యంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలను వారి సాధక బాధలు వెలుగులోకి తీసుకువస్తూ, వారి బాగోగుల కోసం అధికారుల పనిచేసేలా కృషి చేసాడని కొనియాడారు ప్రహరికృష్ణ తన జర్నలిజం ద్వారా దళిత మాజానికి గొంతుకగా నిలిచి, వారిలో నమ్మకాన్ని పెంపొందించే కృషి చేస్తున్నారని, ఈ అవార్డు ఆయన నిరంతర సేవలకు గౌరవప్రదమైన గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన జిల్లా కమిటీ అధ్యక్షులు మల్లని శివ మాదిగకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దళిత రత్న అవార్డు టీ. హరికృష్ణకు లభించడం ద్వారా, సమాజానికి అండగా నిలిచే పత్రికారంగం ప్రాధాన్యత మరింత బలంగా ప్రతిఫలించిందని సమావేశంలో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
