గణేష్ నిమజ్జనోత్సం శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 1300 సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లలోని అన్ని గణేష్ నిమజ్జనోత్సం శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సూచించారు.
అలాగే అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, 200 సి.సి కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలలతోపర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్టు శాఖ, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.
శోభయాత్రలో అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని,ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని* తెలిపారు.
అలాగే ముఖ్యంగా జిల్లాలో డి.జేలు పూర్తిగా నిషేదం విధించినట్లు తెలిపారు.మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.అత్యవసర సమయంలో 100 డయల్, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 87126-59700 లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
