దేశంలో ఐఎస్ఐఎస్ ప్రేరిత ఉగ్రవాద కదలికలున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ జాతీయ దర్యాప్తు సంస్థ తో కలిసి ‘లక్ష్యిత’ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి.
ఇందులో భాగంగా ఇవాళ ఉదయం సౌత్ ఢిల్లీ లో ముంబైకి చెందిన ఆఫ్తాబ్ అనే ఐసిస్ ఉగ్రవాదిని పట్టుకున్నాయి అలాగే జార్ఖండ్‌లోని బొకారో జిల్లా ఇస్లామ్ నగర్‌లోన తబరక్ లాడ్జ్‌లో డానిష్ అనే మరో ఐసీసీ అనుమానిత ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, ఝార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడుల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, రాడికలైజేషన్ మెటీరియల్, కమ్యూనికేషన్ లాగ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు పట్టుబడిన ఆఫ్తాబ్, డానిష్,లు ఇచ్చిన సమాచారం మేరకు ఆయా రాష్ట్రాల్లో ఉగ్రవాదులతో లింక్ ఉన్న 12 మందిని ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అదుపులోకి తీసుకున్నరు ఇందులో భాగంగానే బోధన్ లో సోదాలు జరిగాయి.
