తమ గ్రామానికి ఈ నెల 21 న ఎంగిలి పూవు బతుకమ్మ లో పాల్గొనడానికి రావాలని బిఆర్ యస్ అధినేత కేసీఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తులు కవిత వద్దకు తరలి వచ్చారు
బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వచ్చారు
ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానించారు ..
గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు చింతమడక..అని కవిత పేర్కొన్నారు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఇన్వైట్ చేయటం సంతోషంగా ఉందని అన్నారు
తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.. తన చిన్నప్పుడు చింతమడక లో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కండ్ల ముందే ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.. ఈ సమయంలో మీరంతా వచ్చి తనకు ఇచ్చింది మామాలు ధైర్యం కాదన్నారు
