HomeCRIMEకొత్వాల్ ఎంట్రీ తో అడ్డం తిరిగిన భూకబ్జా కథా ........అయిదు కోట్ల జాగా కొట్టేయడానికి డీసీసీ...

కొత్వాల్ ఎంట్రీ తో అడ్డం తిరిగిన భూకబ్జా కథా ……..అయిదు కోట్ల జాగా కొట్టేయడానికి డీసీసీ రేసులో ఉన్న ఓ నేత బరితెగింపు ……బాధితులు కాంగ్రెస్ నేతలే ………..

ఆయనో అధికార పార్టీకి చెందిన చోటా నేత ….మాజీ మంత్రి కి సన్నిహితుడు అందులోనూ డీసీసీ రేసులో ఉన్నాడు అందుకే తానేమి చేసిన చెల్లిపోతుందని భావించాడు.

ఓ విలువైన స్థలం మీద కన్నేసాడు. బావమరిది ని ముందు పెట్టాడు. తానే తెరవెనుక కథ నడిపాడు. ఎలాగో మాజీ మంత్రి జాన్ జిగ్రీ కదా పోలీస్ అధికారులు ఎలాంటి పత్రాలు కనీస పరిశీలన చేయకుండా సదరు నేత చెప్పిన స్థలం లో మరెవ్వరు రాకుండా కట్టడి చేసారు అయ్యే తాము కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నామని ఆ స్థలం తమదే నంటూ నెత్తినోరు మొత్తుకున్నారు.

కానీ పోలీస్ అధికారులు అసలు ఖాతరు చెయ్యలేదు. స్థానబలం ఉన్న నేత కావడంతో ఆ జాగా వైపు వెళ్లాలంటేనే భయపడ్డారు .

చివరి ప్రయత్నంగా ప్రజావాణి లో భాగంగా పోలీస్ కమిషనర్ సాయి ఛైతన్య ను కలిశారు. ఆయన వారి ఆవేదన విన్నారు. సంబంధిత అధికారులకు గట్టిగా క్లాస్ పీకారు. కనీసం బాధితుల వెరిషన్ వినకుండా ఎలా సపోర్ట్ చేసారంటూ మందలించారు.

చివరికి బాధితుల వద్ద ఉన్న స్థలం తాలూకు పత్రాలను ఆయన క్షుణ్ణంగా చూసారు అరే అన్ని కరెక్టు గా ఉన్నాయి కదా వెళ్లి మీ స్థలం స్వాధీనం చేసుకోండి అంటూ బాధితులకు భరోసా ఇచ్చాడు..

ఎవరైనా జోక్యం చేసుకుంటే తాట తీయండి బాధితుల వద్ద నాలా బదలాయింపు పాత పహాణి లతో ఇతర ధ్రువ పత్రాలు చూసి కింది స్థాయి అధికారులు తెల్ల మొహాలు వేశారు.

దీనితో బాధితులు నేరుగా వెళ్లి తమ స్థలం లో ఉన్న హద్దు రాళ్లను తొలగించి ప్రీకాస్ట్ గోడ ను కట్టడం మొదలు పెట్టారు కానీ అడ్డుకోవడానికి చూసిన సదురు నేత మనుషుల ను పోలీసులు నియంత్రించారు.

మొత్తానికి కొత్వాల్ ఎంట్రీ తో సుమారు రెండు కోట్ల విలువైన స్థలం తమ స్వాధీనం కావడంతో బాధితులు సంబర అంత ఇంత కాదు. నిజామాబాద్ నగరంలోని గంగాస్టాన్ లో బీమ్ గాల్ ప్రాంతానికి చెందిన గంగాధర్ 270 సర్వే నెంబర్ 3146 గజాల స్థలం కొనుగోలు చేశారు.

గంగాధర్ కూడా బీమ్ గల్ లో చిన్నస్థాయి కాంగ్రెస్ లీడర్ కూడా కానీ అదే సర్వే నెంబర్ లో తన బావమరిది కూడా స్థలం ఉండడంతో డిచ్ పల్లి కి చెందిన కీలక నేత ఎంట్రీ ఇచ్చాడు. గంగాధర్ చెప్తున్న స్థలం తన బావమరిది అంటూ పోలీసు అధికారులను ఆశ్రయించాడు.

ఎలాగో ఆయన గుర్తింపు పొందిన నేత కావడంతో పోలీస్ అధికారులు సైతం ఎలాంటి పత్రాలు చూడకుండానే గంగాధర్ ను గద్దించారు ఎహే ఆ జాగా లో వెళ్ళద్దు అంటూ దబాయించారు.

దీనితో బాధితుడు నిస్సహాయుడు అయ్యాడు. చివరికి కొత్వాల్ భరోసా ఇవ్వడంతో ఒక్కరోజులోనే ఆ స్థలం ను స్వాధీనం చేసుకొని ప్రహరీ సైతం నిర్మించుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments