ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలనిపోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నాడు.
ఈ మేరకు వెల్ నెస్ హాస్పిటల్స్ సౌజన్యంతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్ నెస్ హాస్పిటల్ సిబ్బందికి, పోలీసు సిబ్బంది వాహనదారులకు 100 హెల్మెట్లను అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురి అయినప్పుడు ముఖ్యంగా హెల్మెట్ లేనందున తలకు బలమైన గాయాలై చనిపోతున్నారని , అందువలన ద్విచక్ర వాహన దారులు అనుకొని ప్రమాదానికి గురైనప్పుడు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించిన తర్వాతనే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడపాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెల్ నెస్ హాస్పిటల్ యాజమాన్యం తాళ్ల సుమన్ గౌడ్, బొదు అశోక్ లు, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.
