HomeTelanganaNizamabad2వ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

2వ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ జిల్లా ముఖ్య అతిథి. వేం నరేందర్‌రెడ్డి సాయుధ పోరాట ఫలితంగా నే తెలంగాణ రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొందిందని ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు.

ఆయన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జెండా ఆవిష్కరించారు. పల్లెలలో నెలకొన్న వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృ భాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి 17 సెప్టెంబర్ 1948 న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని ఆయన గుర్తు చేశారు

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పు వలన రాష్ట్రం దేశ వ్యాప్తంగా కీర్తిగాంచింది. సుస్థిర ప్రజా పాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలనూ సమాదరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచింది.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు, పట్టణాలతో ప్రభవిల్లుచున్నది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు స్వర్గధామంగా పేరొందింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది.

ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. ప్రజాపాలన:గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్థాయిలో, పట్టణ ప్రాంతాలలో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా విని సమస్యలు పరిష్కరించుట గురించి, ప్రజలకు సుపరిపాలన అందించుటకు, పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకవెళ్ళి, సమస్యల పరిష్కారమునకు ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం తీసుక వచ్చింది.

అదే “ప్రజాపాలన”. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం మహిళల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయటానికి వివిధ పథకాలు తీసుకరావడం జరిగిందన్నారు తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.

దీనికి 22,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తున్నారు. గ్రీన్ ఛానెల్ లో నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు.జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 18,155 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి.

అందులో 9,503 ఇండ్లు ప్రారంభించబడి, వివిధ దశలలో ఉన్నాయి, ఇప్పటివరకు 84.14 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు అంతకు ముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణ రెడ్డి కమిషనర్ సాయి చై తన్య లు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments