HomeLaw and Orderపెండింగ్ బకాయిలు విడుదల చేయాలి..

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి..

పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలనీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా పేర్కొన్నారు.బుదవారం జిల్లా ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనవరి-2024 నుండి మా డిపార్ట్మెంట్ కు రావాల్సిన యస్.యల్.యస్. అడిషనల్ యస్.యల్.యస్.లు (05), జి.పి.యఫ్ లు, 2018 పి.ఆర్.సి బకాయిలు, 2023 టి.ఏ లు బకాయిలు ఇంత వరకు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

అలాగే 2018 పి.ఆర్.సి బకాయిలు రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ ఇచ్చారని ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కే ఇంత వరకు ఇవ్వలేదన్నారు.

ఈ సంవత్సరంలో పిల్లల ఎకాడమిక్ ఇయర్ మొదలైనప్పటి నుండి మా పిల్లలకు ఫీజులు చెల్లించడం లో చాలా ఇబ్బంది పడుతున్నాము.

అతి పెద్ద పండగ అయిన దసరా పండుగ కూడా వస్తున్నందున మా సిబ్బంది యొక్క బాధలను అర్ధం చేసుకోని మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments