గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం,పటికను పట్టుకున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుబ్బా రెడ్డి పేర్కొన్నారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
ఆపరేషన్ సత్కార్ దాడుల్లో భాగంగా నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో గురువారం తనిఖీలు నిర్వహించగా 35 సంచుల నల్ల బెల్లం, పటికను పట్టుబడినట్లు తెలిపారు.
దీంతో వాటిని స్వాధీనం చేసుకొని ప్రయాణికులను విచారించగా ఎవ్వరికి సంబంధం లేదని తెలిపారు.35 సంచులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
2000 కిలోల నల్లబెల్లం విలువ సుమారు రూ 8 లక్షల వరకు ఉంటుందని,అలాగే పటిక విలువ సుమారు రూ 40 వేల వరకు ఉంటుందని తెలిపారు.మొత్తం 8,40,000/- విలువైన మొత్తం 35 సంచులను తదుపరి చర్య కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ దాడిలో ఆర్పీఎఫ్ ఎస్ఐ హరిబాబు, రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి,ఆర్పీఎఫ్, జిఆర్పీఎఫ్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు ఉన్నారు.
