HomeTelanganaNizamabadప్రైవేట్ కళాశాల ఫీజు రెంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్...

ప్రైవేట్ కళాశాల ఫీజు రెంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి..

ప్రైవేట్ కళాశాల ఫీజు రెంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

శుక్రవారము పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.

విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు కళాశాల యజమాన్యాలకు తీవ్రమైన ఇబ్బందుల గురీ కావడం జరుగుతుంది.

ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల కాలేజీలు మూతపడి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది.

కావున ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో…రవి, రాజ్ కుమార్, యుగేందర్, కైలాష్, సాయికుమార్, ఆకాష్, దీపక్, సంతోష్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments