HomeCRIMEకంటైనర్ ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 10 మందికి గాయాలు

కంటైనర్ ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 10 మందికి గాయాలు

ఆగి ఉన్న ఓ కంటైనర్ ను ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటన డిచ్పల్లి మండలం సుద్దపల్లి 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. సుద్దపల్లి వద్ద అప్పుడే ఆగిన ఓ కంటైనర్ ను ఆదిలాబాద్ నుంచి హైదారాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది.

ఈ క్రమంలో లారీని డోకొట్టిన తర్వాత బస్సు డివైడరైపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 10 మందివరకు ప్రయాణికులకు గాయాలైనట్లునట్లు తెలిపారు.

క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments