మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు నగరంలోని గంగాస్థాన్ లో గల ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు సాధించారని ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇంచార్జీ శ్రీకాంత్ తెలిపారు.
ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు శనివారం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎన్టీఏ నిర్వహించిన నీట్ పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు.
2023-25 విద్యా సంవత్సరంలో ఎస్ఆర్ కాలేజీలో రెగ్యులర్ ఇంటర్ తో పాటు నీట్ కోచింగ్ తీసుకున్న వారిలో 11మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారని తెలిపారు.
డీజీఎం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ కాలేజీలో జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన నీట్ లో మంచి కోచింగ్, సీనియర్ మోస్ట్ ఫాకల్టీ, వారాంతపు పరీక్షలు, డైలీ స్టడీ అవర్స్ లో డవుట్స్ క్లారిఫికేషన్ తో పాటు మంచి షెడ్యూల్ ఇవ్వడం వల్ల మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా నీట్ ర్యాంకు సాధించడం అనే ఎస్ఆర్ కాలేజీలో చాలా తేలిక అని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపల్ హన్మంత్ రావు, ఇతర బ్రాంచెస్ ప్రిన్సిపల్స్, అగేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరసింహరెడ్డి, మురళి, టీచింగ్, నాన్ టీచింగ్ పాల్గొన్నారు…
