దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు పోలీసుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కమిషనర్ సాయి ఛైతన్య స్పష్టం చేసారు.
సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలన్నారు . దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించాలన్నారు
ఎవ్వరయిన సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై *ఎక్స్ ప్లోజివ్ యాక్టు – 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు
*అనుమతి పొందిన వారు టపాకాయల దుకాణాల ఏర్పాటు లో జాగ్రత్త లు పాటించాలన్నారు
🔹 టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో ఉండాలి . ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి.
🔹 ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదన్నారు
🔹 జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదన్నారు
తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.పూర్తివివరాలతో కూడిన దరఖాస్తు ఫారంను సంబంధిత ఎ.సి.పి గారి కార్యాలయంలో వివ్వగలరు*.
