కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెల్సింది. పోలీసులు ఒక్కసారి చుట్టూ ముట్టడం తో నిజాంసాగర్ కాల్వ లో దూకేసి అవతల గట్టుకు వెళ్లి నట్లు సమాచారం.
దీనితో అప్రమత్తం అయిన పోలీసులు భారీ సంఖ్య లో సారంగాపూర్ ప్రాంతాన్ని చుట్టూ ముట్టారు. రియాజ్ సారంగా పూర్ ఏరియా లో తల దాచుకున్న స్థావరం ను ప్రత్యేక బృందం శనివారం రాత్రి గుర్తించారు.
రియాజ్ ఉన్న ప్రాంతానికి వెళ్లిన పోలీసులను సైతం రియాజ్ కత్తి తో బెదిరించినట్లు సమాచారం . రాత్రి తొమ్మది గంటలకు మొదలైన గాలింపు లు రాత్రంతా దాదాపు 20 మంది అధికారులు గాలింపులు జరిపారు.
