HomePOLITICAL NEWSNationalపసుపు సాగులో నిజామాబాద్ అగ్రస్థానం..లోక్‌సభలో కేంద్రం వెల్లడి..

పసుపు సాగులో నిజామాబాద్ అగ్రస్థానం..లోక్‌సభలో కేంద్రం వెల్లడి..

రైతుల ఆదాయం పెంపునకు పలు పథకాలతో చేయూతతెలంగాణలో పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో నిజామాబాద్ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

2025–26 సంవత్సరంలో తెలంగాణలో 20.28 వేల హెక్టార్లలో పసుపు సాగు జరిగి, మొత్తం 1.12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైందని మంత్రి తెలిపారు.

ఇందులో నిజామాబాద్ జిల్లా 58.94 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవగా, జగిత్యాల జిల్లా 25.64 వేల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. నిజామాబాద్‌ను పసుపు క్లస్టర్‌గా అభివృద్ధి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, గత ఐదేళ్లలో తెలంగాణలో 29 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), 205 పసుపు బాయిలర్లు, 416 స్పైస్ పాలిషర్లు, 29 ప్రాసెసింగ్ యూనిట్లకు మద్దతు అందించినట్లు వివరించారు.

జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు “జాతీయ పసుపు బోర్డుతో పాటు మసాలా పంటల ప్రోత్సాహ కార్యక్రమం , సమగ్ర ఉద్యానవన అభివృద్ధి మిషన్, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్ వంటి పథకాల ద్వారా పసుపు సాగు నుంచి మార్కెటింగ్ వరకు విలువ గొలుసును బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ చర్యలతో రైతుల ఆదాయం పెరగడంతో పాటు పసుపు ఎగుమతులకు మరింత ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments