తెలంగాణలో లోని పలు చెక్ పోస్టుల మీద ఏసీబీ విరుచుకుపడింది. రవాణా శాఖ కు చెందిన ఆఫీస్ ల్లో సోదాలు చేసింది భారీఎత్తున నగదు లభ్యం అయింది.
పలువురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఆరు చెక్ పోస్టు ల్లో ఏక కాలం లో సోదాలు చేశారు మహబూబ్‌నగర్ జిల్లా లోని క్రిష్ణా చెక్ పోస్ట్.
2) సంగారెడ్డి జిల్లా లోని జహీరాబాద్ చెక్ పోస్ట్.
3) కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, శివారు లోని పెందుర్తి ,మద్నూర్ లోని సలాబత్ పూర్
4) భద్రాద్రి కొత్తగూడం జిల్లా లోని ఆశ్వరావు పేట చ.
5) కొమరంభీమ్ జిల్లా లోని వాంకిడి చెక్ పోస్ట్ లలో డిఎస్పీ స్థాయి అధికారుల సోదాలు చేస్తున్నారు .
అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్, రజినీ భాయి, తిరుపతి, కిరణ్ కుమార్, ఆఫ్రోజ్ లను విచారణ చేస్తున్న అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏకకాలంలో Acb దాడులు నిర్వహించడం రొండవ సారి.
అర్ధరాత్రి నుండి కొనసాగుతున్న దాడులు…కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలబత్‌పూర్ అంతర రాష్ట్ర చెక్‌పోస్ట్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.
టెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ సలాభాత్ పూర్ చెక్‌పోస్ట్‌పై గత నాలుగు నెలల క్రితం కూడా ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
తాజా దాడుల్లో ఓ ప్రైవేట్ వ్యక్తి వద్ద ₹10,200 నగదు, అదనంగా అక్రమంగా సేకరించిన మొత్తాలతో కలిపి మొత్తం ₹36,000 వరకు లెక్కల్లో తేలని డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ దాడులు కొనసాగుతున్నాయని, మొత్తం వివరాలు విచారణలో ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.తమ సిబ్బంది తో దాడులు విచారణ కొనసాగుతున్నాయి అని వివరించారు
